'ఇంటింటా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి'

'ఇంటింటా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి'

PDPL: ఇంటింటా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని శ్రీ కోదండ రామాలయం చైర్మన్ గట్ల రమేశ్ పిలుపునిచ్చారు. వనమహోత్సవంలో భాగంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 43వ డివిజన్‌లో ఇంటింటా మొక్కలు పంపిణీ చేశారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తోడ్పడాలని సూచించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.