జాతీయ జెండా రూపకర్త మన జిల్లా వాసి

కృష్ణా: పామర్రు(M) బట్ల పెనుమరు చెందిన పింగళి వెంకయ్య మహాత్మాగాంధీ సమకాలికుల్లో ఒకరు. స్వాతంత్య్ర పోరాటంలో అనేక జాతీయ పతాకాలు ఉపయోగించినప్పటికీ, పింగళి రూపొందించిన పతాకాన్నే 1921 మార్చి 31–ఏప్రిల్ 1 విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో జాతీయ పతాకంగా ఏకగ్రీవంగా నిర్ణయించారు. గాంధీ సూచనతో రాట్నం గుర్తు, స్వాతంత్య్ర అనంతరం నెహ్రూ సూచనతో అశోకచక్రం అమర్చారు.