నందిగామలో రౌడీ షీటర్‌లకు కౌన్సెలింగ్

NTR: నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రౌడీషీటర్‌లకు సీఐ నాయుడు కౌన్సెలింగ్ ఇచ్చారు. నందిగామ మండల పరిధిలో అసాంఘిక కార్యక్రమాలకు తావు లేదని, అటువంటి చర్యలు చేసే వారిపై కట్టిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపారు. సత్ప్రవర్తన కలిగి ఉంటే భవిష్యత్తులో మీపై ఉన్న షీట్ తొలగించే అవకాశం ఉందని పేర్కొన్నారు.