'షష్ఠి ఉత్సవాలకు సెలవు ప్రకటించాలి'
W.G: సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల సందర్భంగా ఇవాళ సెలవు ప్రకటించాలని ఫ్యాప్టో ఛైర్మన్ పీఎస్ విజయరామరాజు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఫ్యాప్టో ఛైర్మన్ సాయి శ్రీనివాస్ పిలుపుమేరకు ఇవాళ భీమవరం డీఈవో కార్యాలయం వద్ద నిరసనకు దిగనున్నట్లు తెలిపారు. షష్ఠి రోజున విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తుందని గుర్తు చేశారు.