పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆర్డీవో
SRCL: వేములవాడ అర్బన్ మండలం ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామంలో పోలింగ్ ప్రక్రియను వేములవాడ ఆర్డీవో రాధాబాయి పరిశీలించారు. పోలింగ్ ప్రారంభానికి ముందే అక్కడికి చేరుకున్న ఆమె పోలింగ్ సిబ్బందితో మాట్లాడి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.