VIDEO: కంభంలో మోస్తరు వర్షం

ప్రకాశం: కంభం పట్టణంలో బుధవారం రాత్రి ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఓ మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుండి ఎండ తీవ్రతకు ఉక్కపోతకు అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం పడుతుండడంతో కొంతమేరకు ఉపశమనం పొందారు. అయితే ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు లేకపోవడంతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగలేదని స్థానిక ప్రజలు తెలిపారు.