కుక్కల దాడిలో 55 మేకల పిల్లల మృతి

కుక్కల దాడిలో 55 మేకల పిల్లల మృతి

VKB: పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామంలో ఒగ్గు సత్తయ్య ఇంటి దొడ్డిలో సోమవారం కట్టేసి ఉంచిన మేక పిల్లలపై ఊర కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 55 మేకలు మృతి చెందాయి. లక్షల్లో నష్టం వాటిల్లడంతో మేకల యజమాని సత్తయ్య కన్నీరుమున్నీరుగా విలపించారు. బాధితుడికి ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.