కుల్కచర్లలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
VKB: జిల్లా SP స్నేహ మెహ్ర ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రేషన్ బియ్యం అక్రమ నిల్వలపై ఆదివారం దాడులు చేశారు. కుల్కచర్ల మండలంలో ప్రదీప్ ఇంట్లో 38 బస్తాలు, రవితేజ దుకాణంలో 31 బస్తాల బియ్యం పట్టుబడింది. టాస్క్ ఫోర్స్ ఇన్స్‌స్పెక్టర్ అన్వర్ బాషా ఆధ్వర్యంలో మొత్తం 3,540 కిలోల రేషన్ బియ్యం సీజ్ చేసి నిందితులపై కుల్కచర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.