నేటి కూరగాయల ధరల వివరాలు

కృష్ణా: కంకిపాడు రైతుబజార్‌లో ఆదివారం వివిధ కూరగాయల ధరలు కేజీలలో ఇలా నమోదయ్యాయి. వ్యాపారుల తెలిపిన వివరాల ప్రకారం టమాట ₹39, వంకాయ ₹18, బెండకాయ ₹30, బీట్రూట్ ₹31, దోసకాయ ₹20, కీరదోస ₹47, ఫ్రెంచ్ బీన్స్ ₹75, పచ్చిమిర్చి ₹55, కాకరకాయ ₹30, గోరుచిక్కుడు ₹32, బంగాళాదుంప ₹29, ఉల్లిపాయ ₹26, క్యాబేజీ ₹22, క్యారెట్ ₹45, బీర ₹38, దొండకాయ ₹36, అల్లం ₹85గా ఉన్నాయన్నారు.