నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NLG: తిరుమలగిరిసాగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా, గురువారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మండల విద్యుత్ శాఖ ఏఈ వెంకట్ రెడ్డి బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యుత్ అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.