డోలీ యాత్ర త్వరలో ప్రారంభం
పార్వతీపురం జిల్లాలో మారుమూల ప్రాంతాల రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం ‘డోలీ యాత్ర’ త్వరలో ప్రారంభం కానుందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. డోలీ రోడ్ల పనుల పురోగతిని పరిశీలించేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. పనుల్లో నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.