కొత్తపేట వీధుల్లో కుక్కల స్వైర విహారం
గుంటూరు కొత్తపేట ప్రధాన వీధుల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వాహనదారులు, పాదాచారులు, పిల్లలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కుక్క కాటుతో దేశంలో పలు మరణాలు సంభవించిన ఘటనలతో స్థానికులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని గురువారం ప్రజలు కోరారు.