'ప్రైవేటు వద్దు ప్రభుత్వ బడి ముద్దు'

SKLM: నరసన్నపేట మండలం రావులవలసలో గురువారం ఉదయం ఎంఈఓలు యు.శాంతారావు, పీ.దాలినాయుడు ఆధ్వర్యంలో "ప్రైవేటు వద్దు ప్రభుత్వ బడి ముద్దు" అంటూ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు.