'చికెన్ వ్యర్ధాలపై చర్యలు తీసుకోవాలి'
NLR: సంగం తహశీల్దార్ కార్యాలయంలో మత్స్యశాఖ జేడీ శాంతి చేపల గుంతలపై రెవెన్యూ పోలీస్ విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనుమతులు లేకుండా వేసిన చేపల గుంతలను తొలగించాలన్నారు. అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్ధాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్ధాల వాహనాలను అదుపులో తీసుకొని చర్యలు తీసుకోవాలన్నారు.