కసాపురం ఆలయానికి భారీ ఆదాయం
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఇవాళ భక్తాదుల స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను లెక్కింపు చేశారు. ఆలయ ఈవో విజయ రాజు మాట్లాడుతూ.. 31 రోజుల హుండీ కానుకలను లెక్కింపు చేయగా రూ.21,10,085 నగదు, బంగారం 1 గ్రాము, వెండి 410 గ్రాములు, అన్నదానం హుండీ ద్వారా రూ.46,181 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.