ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత: ఎమ్మెల్యే
MBNR: ఆధ్యాత్మిక చింతన ద్వారా శాంతి, ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పద్మావతి కాలనీలోని అయ్యప్ప కొండపై కొలువుదీరిన శివమార్కండేయ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని తెలిపారు. ప్రజలందరిపైన మార్కండేయస్వామి ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.