పట్టుబడ్డ వాహనాలకు రేపు వేలం
MLG: ఎక్సైజ్ శాఖ ములుగు స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలకు ఈ నెల 23న వేలం నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ సుధీర్ తెలిపారు. భూపాలపల్లి జిల్లా ఎక్సైజ్ అధికారి సమక్షంలో మధ్యాహ్నం 12:30 గంటలకు వేలం మొదలవుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.