పరవాడ మండల ప్రత్యేక అధికారిగా గోవిందరావు
AKP: పరవాడ మండల ప్రత్యేకాధికారిగా ఎన్.గోవిందరావు శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈ బాధ్యతలు చేపట్టిన ఎన్.సరోజిని పదవీ విరమణ చేయడంతో ఈ నియామకం జరిగింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన గోవిందరావు మండల స్థాయి అధికారులతో శాఖల వారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మండలాల వివరాలను తెలుసుకున్నారు.