VIDEO: కడియంకు వ్యతిరేకంగా హనుమకొండలో ఆందోళన

హనుమకొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఎదుట సోమవారం స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నాపనేని నరేందర్‌తో కలిసి కార్యకర్తలు కడియం డౌన్ డౌన్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.