పారిశుద్ధ్య పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

పారిశుద్ధ్య పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో అధికారులతో పారిశుద్ధ్య కార్యక్రమాలపై బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ విధులకు హాజరు కావాలని, వార్డు శానిటరీ సెక్రటరీలు బాధ్యతలు తీసుకోవాలని ఆయన కోరారు. కాలువల్లో నీరు ఇళ్లలోకి చేరకుండా శుభ్రం చేయాలన్నారు.