నీలాద్రీశ్వర స్వామిని దర్శించుకున్న చాగంటి దంపతులు
KMM: ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దంపతులు గురువారం పెనుబల్లి మండల రిజర్వ్ ఫారెస్ట్‌లోని శ్రీ నీలాద్రీశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో రజినీ కుమారి, ఛైర్మన్ చీకటి నరసింహారావు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, శేష వస్త్రాలతో వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.