నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRPT: అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో 11 కేవీ వైర్లకు చెట్టు కొమ్మలు తొలగింపు పనులు నేడు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ సీతారాం బుధవారం తెలిపారు. ఈ పనుల కారణంగా గ్రామంలో నేడు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని, ప్రజలు సహకరించాలని కోరారు.