మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారం.. పదేళ్లజైలు శిక్ష.!
ప్రకాశం: మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పునిచ్చారు. ఒంగోలుకు చెందిన నారాయణ మతిస్థిమితంలేని మహిళపై అత్యాచారానికి పాల్పడినట్టు 2021లో ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందింది. విచారణ అనంతరం న్యాయస్థానం నిందితుడికి శిక్ష విధించింది.