పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

BHPL: రైతులు పండించిన పత్తికి కనీస మద్దతు ధర(MSP) సీసీఐ కేంద్రాల్లోనే లభిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. చిట్యాల మండలం శాంతినగర్ శివారులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులకు పత్తిని అమ్మి నష్టపోవద్దని సూచించారు. కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని తెలిపారు.