షీ టీమ్ అదుపులో నలుగురు పోకిరీలు

షీ టీమ్ అదుపులో నలుగురు పోకిరీలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు ఉద్యానవనం వద్ద అల్లరిచేస్తూ, ఈవ్ టీజింగ్‌కి పాల్పడుతున్న నలుగురు పోకిరీలను జిల్లా షీ టీమ్ ఇన్ఛార్జ్ ఎస్సై ఉషారాణి ఆధ్వర్యంలో శనివారం అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా ఏర్పాటు చేసి, ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని షీ టీమ్ ఆఫీసుకు తరలించారు.