'జనరల్ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించండి'
MBNR: ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్‌లను కాంగ్రెస్ బీసీ నేతలు మైత్రి యాదయ్య, మురళి, శ్రీనివాస్, బాలగోపి తదితరులు శుక్రవారం కలిశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్న హామీ మేరకు, రాబోయే ఎన్నికల్లో జనరల్ స్థానాలలో కూడా బీసీలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని వారు కోరారు.