డాల్ఫిన్ నోస్ కాలనీలో డీఆర్ఎం పర్యటన

VSP: విశాఖ రైల్వే కాలనీలలోని సౌకర్యాలు, వసతులను అంచనా వేయడానికి డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లలిత్ బోహ్రా శనివారం డాల్ఫిన్ నోస్ కాలనీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, లైటింగ్, భద్రత, రైల్వే క్వార్టర్ల పరిస్థితిని తెలుసుకున్నారు. కాలనీలో సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.