ప్రజా పాలనలో మండల స్థాయి సమావేశం
KNR: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చొప్పదండి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, తదితర సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేశ్, మున్సిపల్ ఛైర్మన్ సరిత పాల్గొన్నారు.