ప్రజలకు కేంద్రమంత్రి పెమ్మసాని కీలక సూచనలు
AP: ప్రజలకు కేంద్రమంత్రి పెమ్మసాని కీలక సూచనలు చేశారు. సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు 'సంచార్ సాథీ' యాప్‌ను వినియోగించాలని తెలిపారు. టెలికాం మంత్రిత్వశాఖ, డిజిటల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి యాప్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. గతేడాది నుంచి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది సైబర్ నేరాలకు గురయ్యారని, ఇప్పటివరకు రూ.23 వేల కోట్లు నష్టపోయారని వెల్లడించారు.