మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య

మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్య

ప్రకాశం: బేస్తవారిపేటకు భూతపాటి జగన్(28) మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ మేరకు గురువారం మద్యం కోసం భార్యను డబ్బులు అడగగా లేవని చెప్పడంతో విషం తాగాడు. పరిస్థితి విషమంగా మారడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా శనివారం మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.