పన్ను వసూలు చేస్తున్న డిప్యూటీ ఎంపీడీవో

పన్ను వసూలు చేస్తున్న డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఉంగుటూరు మండలంలో నూరు శాతం ఇంటి పన్ను వసూలు చేస్తామని డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు అన్నారు. బుధవారం కైకరం గ్రామంలో పంచాయితీ అధికారులతో ఆయన ఇంటింటికీ వెళ్లి ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూలు చేశారు. ఫోన్ లేని వారు పంచాయతీకి వచ్చి పన్ను కడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి సుమలత, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.