ALERT: ఎండలో బయటకు వెళ్తున్నారా?

ALERT: ఎండలో బయటకు వెళ్తున్నారా?

AP: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వడగాలులు, ఉక్కపోత నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. రేపు పలు మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని సూచించారు.