గొంతు నొప్పి ఎందుకు వస్తుంది?

గొంతు నొప్పి ఎందుకు వస్తుంది?

శీతాకాలంలో చాలామందిని బాధించే సీజనల్ సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. ముక్కు, నోరు ద్వారా వైరస్ లోపలికి ప్రవేశించేక్రమంలో ఇమ్యూనిటీ స్పందించడం వల్ల గొంతులోని పొరల్లో మంట కలుగుతుంది. ఇదే మనకు గొంతునొప్పిగా అనిపిస్తుంది. గుటక వేయడం, మింగడం, మాట్లాడటం కూడా కష్టంగా అనిపిస్తుంది. వేడి నీరు, నిమ్మరసం, ఉప్పు నీరు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం వల్ల ఉపశమనం పొందవచ్చు.