బీమా చెక్కు అందచేత

బీమా చెక్కు అందచేత

SDPT: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. గజ్వేల్ మండలంలోని జాలిగామకు చెందిన డ్వాక్రా గ్రూప్ సభ్యురాలు రాచమల్ల సూరవ్వ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నర్సారెడ్డి చొరవతో డ్వాక్రా గ్రూప్ బీమా పథకం ద్వారా ఆమె కుటుంబానికి మంజూరైన రూ. 10 లక్షల చెక్కును నేడు అందజేశారు.