పేరూరు వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

పేరూరు వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం

కోనసీమ: అమలాపురం పేరూరు వై జంక్షన్‌కి సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బోడసకుర్రు నుంచి వస్తున్న ఒక బైక్ పేరూరు కరెంట్ ఆఫీసు వద్దకు వచ్చే సరికి స్కూటీ నీ ఢీ కొట్టడంతో స్కూటీ పై వెళ్తున్న అంగన్వాడి టీచర్ జల్లి సూర్యావతి ని బలంగా ఢీకొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కుమార్తెకు స్వల్ప గాయాలు అయ్యాయి. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.