నిందితులను 24 గంటల్లో పట్టుకుంటాం: DSP
TPT: రేణిగుంట లక్ష్మీ నివాసం కన్‌స్ట్రక్షన్ బిల్డింగ్‌లో జరిగిన హత్య కేసును 24 గంటల్లో పరిష్కరిస్తామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా ఈ హత్య పథకం ప్రకారం జరిగిందని చెప్పారు. సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకుంటామని, ఇప్పటికే మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు, మృతుడి వివరాలు త్వరలో వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.