ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, నటుడు దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో అతను సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే టైటిల్‌ను వెల్లడిస్తామని అజయ్ భూపతి చెప్పాడు. నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాడు. ఇక ఈ చిత్రం తిరుమల బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది.