ఆదోని కేంద్రంగా కొత్త పార్లమెంట్ స్థానం..?
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న కర్నూలు, నంద్యాల స్థానాలకు అదనంగా ఆదోని కేంద్రంగా కొత్త పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా 'సెకండ్ బాంబే'గా పేరుగాంచిన ఆదోని జిల్లాలోనే కీలక కేంద్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఎంపీ స్థానం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.