వైసీపీ ముసుగు మళ్లీ తొలగింది: షర్మిల

వైసీపీ ముసుగు మళ్లీ తొలగింది: షర్మిల

AP: బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్ధతు ప్రకటించడంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీకి వైసీపీ బీటీమ్ అని నిజ నిర్ధారణ జరిగిందంటూ ఆరోపించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతుతో మరోసారి తేటతెల్లమైంది అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది కూడా మోదీ పక్షమేనని తేలిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.