బైక్ ఢీకొని మహిళ మృతి

WNP: బైక్ ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల దగ్గర జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నర్సింగయ్యపల్లికి చెందిన సుగుణమ్మ, అనసూయ ఈరోజు ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో గోపాల్ పేట వైపు నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన ఓ వ్యక్తి వారిని ఢీకొట్టాడు. ఆ సమయంలోనే మరొక బైక్‌పై వచ్చిన మరో వ్యక్తి సుగుణమ్మపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.