బయ్యారంలో మండల స్థాయి సమావేశం
MHBD: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక భాగంగా బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో దీపిక ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మండలంలోని 29 పంచాయతీల సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించుకున్నారు.