వెన్నాచేడ్ రహదారి స్వచ్ఛత కార్యక్రమం
MBNR: గండీడ్ మండలం వెన్నాచేడ్ దుర్గమాత మైదానం లింగాయ పల్లి రహదారిలో చెత్తను శుభ్రపరిచే కార్యక్రమం సర్పంచ్ గుర్రాల నవనీత చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. జేసీబీ సహాయంతో చెత్త తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. స్థానికులు ఈ చర్యను అభినందించి రహదారిని స్వచ్ఛంగా ఉంచేందుకు అందరూ సహకరించాలని, చెత్తను కేవలం బండిలో వేయాలని కోరారు.