రైతు కంట కన్నీరు.. ప్రభుత్వం తుడిచేనా.!
వికారాబాద్ జిల్లాలో మొంథా తుఫాన్‌కు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 10వేల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రైతుల అకౌంట్లలో ఇప్పటి వరకు డబ్బులు జమ కాలేదు. చేతికి వచ్చిన పంటలు నష్టపోయామని రైతులు వాపోతున్నారు. సీఎం సొంత జిల్లాలోని నష్టపరిహారం రాకపోవడంతో పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.