VIDEO: 'ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం'
SRPT: సూర్యాపేటలో విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె ఈరోజు 8వ రోజుకు చేరింది. 30 ఏళ్లుగా సేవలందిస్తున్నా, రిటైర్మెంట్ ప్రయోజనాలు లేకపోవడంపై కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలన్నారు. అరకొర జీతాలతో కుటుంబాలను పోషించడం భారంగా మారిందని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.