'ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తాం'
AP: రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పినట్లే చేస్తున్నామని CM చంద్రబాబు అన్నారు. సంక్షేమం, అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఉచితంగా కరెంట్ వచ్చే సోలార్‌ను వినియోగించుకోలేదని చెప్పారు. గ్రీన్ ఎనర్జీతోనే భవిష్యత్ ఉందన్నారు. రాబోయే మూడేళ్లలో 5వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం.. RTC బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ప్రకటించారు.