VIDEO: 'వాహనదారులు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలి'
WNP: వాహనదారులు సరైన పత్రాలు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని వనపర్తి ట్రాఫిక్ ఎస్సై సురేంద్ర అన్నారు. వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద సిబ్బందితో కలిసి వాహనాల విస్తృత తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు.