పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
PLD: కారంపూడి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో, ఎంపీవో, తహసీల్దార్ తదితర గెజిటెడ్ అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ్టి నుంచి గ్రామ పరిపాలన, పథకాల అమలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ చేపడతారు. వివరాలు మండల కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.