మద్యం తాగే టైమింగ్స్ ఛేంజ్.. ఉల్లంఘిస్తే భారీ జరిమానా
థాయిలాండ్ సందర్శించే మద్యపాన ప్రియులకు షాక్. థాయిలాండ్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మద్యం సేవించడం నిషేధించారు. ఈ చట్టం నిన్నటి నుంచే అమలులోకి వచ్చింది. ఉల్లంఘించిన వారికి భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.27,357 జరిమానా విధిస్తారు. మరోవైపు దీనివల్ల వ్యాపారం నష్టపోతుందని రెస్టారెంట్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.