భార్య చనిపోయిందని భర్త నిరసన..!
HYDలో BN రెడ్డి నగర్ ప్రాంతంలో నీలాద్రి ఆసుపత్రి ముందు ఓ బాధిత భర్త నిరసనకు దిగాడు. డాక్టర్ల నిర్లక్ష్యంతో తన భార్య మృతిచెందిదని నాగర్ కర్నూల్ ప్రాంతానికి చెందిన భర్త రవి ఆసుపత్రి ఎదుట కుటుంబీకులతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు. నిన్న రాత్రి తన భార్య లలితను ఆసుపత్రికి తీసుకురాగా డెలివరీ జరిగిందని, ఇవాళ మృతిచెందిదని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు డిమాండ్ చేశాడు.