దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మురుగు కాలువలు

పల్నాడు: రేపల్లె పట్టణంలో ప్రధాన డ్రైన్లు, వ్యర్థాలు తాగునీటి పైపులైన్లు పూడుకుపోవడంతో మురుగునీరు పారుదల కాక దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు వృద్ధిచెంది ఇబ్బంది పడుతున్నామని పట్టణ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్ థియేటర్ వెనుక రోడ్లో మురికి కాలువలన్ని వ్యర్థాలు, మట్టితో పూడుకుపోయి మురుగునీరు పారుదల లేదని పట్టణవాసులు తెలిపారు. అధికారులు ఈ సమస్య తిర్చాలని కోరారు.